: పశు మాంసంపై అసదుద్దీన్ ఒవైసీతో ఏకీభవించిన జైట్లీ
గొడ్డు మాంసం తినాలనుకునే వారు పాకిస్థాన్ లేదా అరబ్ దేశాలకు వెళ్లిపోవాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఢిల్లీలో మోదీ ఏడాది పరిపాలనపై ప్రసంగించిన సందర్భంగా నఖ్వీ వ్యాఖ్యలపై వివరణ అడిగిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, దేశం పట్ల ప్రజలకు బాధ్యత ఉందని, అది ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, నఖ్వీ వ్యాఖ్యానించిన సందర్భంగా అక్కడే ఉన్న అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, ఒకరి ఆహారపుటలవాట్లను మరొకరు తప్పు పట్టవద్దని, ఏం చేయాలో ప్రజలనే నిర్ణయించుకోనివ్వాలని సూచించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం పశు మాంసంపై నిషేధం విధించిన సందర్భంగా వివాదం రేగింది.