: దూకుడా? చతురతా?... విజయం దేనిది?


ఐపీఎల్ సీజన్-8 ముగింపుకు చేరుకుంది. నాకౌట్ పోటీలు నేటితో ముగియనున్నాయి. ఫైనల్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు హోరాహోరీ తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. నేడు జరగనున్న నాకౌట్ మ్యాచ్ ను దూకుడు, చతురత మధ్య పోటీగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటలోనే కాదు, నిర్ణయాల్లోనూ దూకుడుగా ఉండే కోహ్లీ జట్టును గెలిపిస్తాడో... లేక ఫినిషింగ్, వ్యూహ చతురతలో ఆరితేరిన ధోనీ తన జట్టును గెలిపిస్తాడో చూసేందుకు అభిమానులు సిద్ధపడిపోయారు. ధోనీ సోంత ఊళ్లో జరిగే ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. కోహ్లీ, గేల్, డివిలియర్స్, స్టార్క్ తురుపుముక్కలుగా ఉన్న బెంగళూరు ప్రత్యర్థులను అవలీలగా ఓడిస్తూ అంతిమ సమరానికి అడుగు దూరంలో నిలవగా... మెక్ కల్లమ్, రైనా, ధోనీ వ్యూహాల అండతో చెన్నై జట్టు మొట్టమొదట నాకౌట్ కు చేరింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టైటిల్ రేసులో నిలుస్తారు. ఈ నేపథ్యంలో ఎవరిది విజయం అనే దానిపై సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఫైనల్ కాని ఫైనల్ అంటూ అభిమానులు, విశ్లేషకులు, క్రీడా పండితులు ఈ మ్యాచ్ ను అభివర్ణించడం విశేషం.

  • Loading...

More Telugu News