: 'కమిషన్ కాకతీయ' అంటూ మరోసారి నోరు జారిన నాయిని


తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి 'కమిషన్ కాకతీయ' పదాన్ని మరువలేకపోతున్నట్టున్నారు. నిన్న (గురువారం) ఓ ప్రెస్ మీట్ లో 'కమిషన్ కాకతీయ' అని నాయిని అనగానే, పక్కనే ఉన్న జగదీష్ రెడ్డి అప్రమత్తం చేశారు. కానీ ఈరోజు కూడా ఆయన అలాగే మాట్లాడారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని వెంగళరావు పార్కులో 65 లక్షలతో మురుగునీరు మళ్లింపు పనులకు మంత్రి నాయిని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు నేతృత్వంలో 'కమీషన్ కాకతీయ' బాగా జరుగుతుందని అంటూ నోరుజారారు. దాంతో అక్కడివారంతా నిర్ఘాంతపోయి లోలోపల నవ్వుకున్నారు.

  • Loading...

More Telugu News