: ఇద్దరు పిల్లల వివాదం విషయంలో పోలీసులకు బాంబే హైకోర్టు చీవాట్లు


11 ఏళ్ల క్రిందట రుబీనా షేక్, రఫీక్ దంపతులకు ఓ చెత్త కుండీ పక్కన ఆరు నెలలు, ఏడాదిన్నర వయసున్న పసిపాపలు దొరికారు. అప్పటికే నలుగురు పిల్లలున్న ఆ దంపతులు, వారిని అల్లా ప్రసాదంగా భావించి, కైసర్, కౌజర్ అంటూ పేర్లు పెట్టి సాకడం ప్రారంభించారు. పిల్లలిద్దరూ పెద్దవాళ్లవుతున్నారు. ఇంతలో ఓ మహిళ వారిద్దరూ తమ పిల్లలు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాలికా సంరక్షణ కేంద్రానికి చేర్చారు. తగువు తేలిన తరువాత పిల్లల్ని అప్పగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తల్లడిల్లిన రుబీనా, రఫీక్ దంపతులు, 'పిల్లలకు ఐదవ తరగతి పరీక్షలు దగ్గరపడ్డాయి, ఇంటికి పంపండి' అని పోలీసుల, సంరక్షణా కేంద్రం అధికారులను కోరారు. వారు పట్టించుకోకపోవడంతో బాంబే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం, 'పిల్లలు ఫిర్యాదుదారు పిల్లలే అని ఎలా నిర్ధారించార'ని పోలీసులను ప్రశ్నించింది. నిర్ధారించకుండా సంరక్షణ కేంద్రానికి ఎలా అప్పగించారని నిలదీసింది. విచారణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు చీవాట్లు పెట్టి, పిల్లలను రుబీనా, రఫీక్ దంపతులకు అప్పగించాలని ఆదేశించింది. దీంతో తమ పిల్లలు తమ వద్దకు చేరారు, అది చాలని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News