: అతివలను ఇంటర్నెట్ కు దూరం చేస్తున్న కారణాలివే...!
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తాజాగా 'ఉమెన్ అండ్ టెక్నాలజీ' పేరిట ఓ అధ్యయనం చేపట్టింది. అందులో ప్రధానంగా, మహిళలను ఇంటర్నెట్ కు దూరం చేస్తున్న కారణాలను గుర్తించారు. నెట్ ను ఉపయోగించే మహిళల్లో ఆర్థిక స్వావలంబన కనిపించగా, నెట్ కు దూరంగా ఉన్న మహిళల్లో కాసింత వెనుకబాటుతనం గుర్తించారు. ఈ క్రమంలో, అతివలను ఇంటర్నెట్ కు దూరం చేస్తున్న కారణాలను తెలుసుకున్నారు. ఇంటి పనుల ఒత్తిడి, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం, అత్తమామల భయం, నెట్ కనెక్షన్ ఖర్చుల భారం... ఇత్యాది అంశాలన్నీ మగువలను టెక్నాలజీ స్రవంతికి దూరం పెడుతున్నాయట. భారత్ లో అయితే 49 శాతం మహిళలు ఇంటర్నెట్ కు ఆమడదూరంలో ఉన్నారని అధ్యయనం చెబుతోంది. పని ఒత్తిడి కారణంగా అలసిపోవడంతో విశ్రాంతికే ప్రాధాన్యమిస్తామని, ఇక, నెట్ బ్రౌజింగ్ కు సమయమెక్కడిదని అత్యధికులు చెప్పారట.