: మగాళ్లది నీచబుద్ధి... అసలు వంట అన్నది మగాళ్ల పని: రాంగోపాల్ వర్మ


మగాళ్లు నీచబుద్ధితో ఆడవాళ్లను వంటగదికే పరిమితం చేసేశారని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ విమర్శించాడు. '365 డేస్' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ వంటల ప్రోగ్రాంలో పాల్గొన్న వర్మ మాట్లాడుతూ, మగాళ్లను ఆడవాళ్లు డామినేట్ చేసేస్తారని భయపడి వాళ్లని వంటగదికే పరిమితం చేసేశారని చెప్పాడు. అసలు వంట అన్నది మగాళ్ల పని, అని చెబుతూ, అప్పట్లో మగాళ్లే వంటలు చేసేవారని, 'అందుకే నలభీమ పాకం' అన్నారని చెప్పాడు. ఆడవాళ్లు మగవాళ్లతో వంటలు చేయించాలని వర్మ సూచించాడు. తాను వంట గదిలోకి వెళ్లి సుమారు 20 ఏళ్లు అయి ఉంటుందని వర్మ చెప్పాడు. తనకు ఆకలి వేసే సమయానికి తన టేబుల్ పై గడ్డి ఉన్నా తింటానని అన్నాడు. అసలు గడ్డిలోనే పోషక విలువలన్నీ దాగి ఉన్నాయని చెప్పాడు. అందుకే ఆవులు, జింకలకి షుగర్, బీపీ వంటివి రావని... రుచి అని, పోషకాలని, కాలరీలని, రకరకాల వంటలు చేసుకునే మనిషికే జబ్బులన్నీ వస్తాయని వర్మ చెప్పాడు. అందుకే అన్ని రకాల ఆహారాల్లోకి మంచి ఆహారం గడ్డి అని చెప్పాడు. అప్పుడప్పుడు గడ్డి తింటే ఒంటికి మేలు అని అన్నాడు.

  • Loading...

More Telugu News