: ఆయనను ఫాలో అవండి... ఆయన మీ హీరోకే హీరో: ఫ్యాన్స్ కు సల్మాన్ సూచన
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాను హాలీవుడ్ నటుడు సిల్వస్టర్ స్టాలోన్ ను విపరీతంగా అభిమానిస్తానని తెలిపారు. ఆయనే తనకు ఆదర్శమని, ఆయన నుంచి తాను ప్రేరణ పొందుతానని పేర్కొన్నారు. అంతేగాకుండా, ట్విట్టర్ లో ఎవరైనా హాలీవుడ్ స్టార్లను ఫాలో అవ్వాలంటే, స్టాలోన్ ను ఫాలో అవ్వండని అభిమానులకు సూచించారు. "ఎందుకంటే, ఆయన మీ హీరోకే హీరో" అని వివరించారు. స్టాలోన్ మంచి నటుడు, దర్శకుడు, రచయిత అని అంతకన్నా గొప్ప వ్యక్తి మరెవరూ లేరని సల్మాన్ ట్వీట్ చేశారు.