: నన్ను చూసి కేంద్రం భయపడుతోంది: కేజ్రీవాల్
లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు వివరిస్తూ, కేంద్రం నోటిఫికేషన్ వెలువరించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. అది వారి అభద్రతా భావానికి నిదర్శనమని, తనను చూసి కేంద్రం భయపడుతోందని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక పాలనపై భయం పట్టుకుందని అన్నారు. 'మొదట ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ, ఇప్పుడు మా ప్రభుత్వానికి నోటీసులిచ్చి మరోసారి ఓడిపోయింది' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. కాగా, ఈ నోటిఫికేషన్ పై కేజ్రీవాల్ మరికాసేపట్లో ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య అంతరం మరింతగా పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితి మరింతగా అదుపు తప్పకుండా రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలని సూచిస్తున్నారు.