: కోల్ స్కాం కేసులో దాసరికి బెయిల్
బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం కేసులో దర్శకుడు దాసరి నారాయణరావుకు ఊరట లభించింది. ఈ కేసులో నేడు కోర్టుకు హాజరైన ఆయనకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. దాసరితో పాటు కేసులోని మిగతా నిందితులైన కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, మరో 12 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కింద ఒక్కొక్కరూ రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అయితే, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించింది. అంతేగాక కేసులో సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది.