: విజయవాడకు వచ్చేసిన చంద్రబాబు భద్రతా విభాగం... క్యాంపు కార్యాలయాన్ని మార్చిన తొలి మంత్రిగా ఉమ


నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ వచ్చేసింది. మొత్తం 60 మంది భద్రతాధికారులు ఈ విభాగంలో పనిచేస్తుండగా, కొంతమందిని హైదరాబాద్ నుంచి విజయవాడకు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఏఆర్ గ్రౌండ్స్ లో ఒక షెడ్డును కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు హైదరాబాదులో కొత్త కాన్వాయ్ ఉపయోగిస్తున్న నేపథ్యంలో, పాత కాన్వాయ్ ని ఇక్కడ రెడీగా ఉంచి కోస్తా జిల్లాల పర్యటనలో వినియోగించనున్నారు. ఇదిలావుండగా, మంత్రులందరూ తమ తమ క్యాంపు కార్యాలయాలను అమరావతికి సమీపంలో ఉండేలా చూసుకోవాలని బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు మంత్రులు స్పందిస్తున్నారు. ఏపీ భారీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ తన కార్యాలయాన్ని విజయవాడకు తరలించిన తొలి మంత్రిగా నిలిచారు.

  • Loading...

More Telugu News