: నాలుగు బస్సులు ఢీ... 20 మందికి గాయాలు
ఒక బస్సు ఆగి వుంది. మరో రెండు బస్సులు ఎదురెదురుగా వస్తున్నాయి. ఆగివున్న బస్సును గమనించక దాన్ని దాటే క్రమంలో ఈ రెండు బస్సులూ ఢీకొని ఆగివున్న బస్సును గుద్దేశాయి. ఇదే సమయంలో, అదే దారిలో వస్తున్న మరో బస్సు సమయానికి బ్రేకులు పడక, ఢీకొన్న బస్సులను గుద్దుకుంది. ఈ విచిత్ర ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కైరవాడి దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. రెండు బస్సుల డ్రైవర్లతో పాటు ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు ఇది జరిగిన తీరు చూసి విస్మయం వ్యక్తం చేశారు.