: నేలా? నిప్పుకణికా?... నేడు 50 డిగ్రీలకు అవకాశం... చాలా జాగ్రత్తగా ఉండమంటున్న అధికారులు


రోడ్లపై కోడిగుడ్డు పగిలితే ఆమ్లెట్ అవుతోంది. పచ్చడి కోసం మామిడికాయ ముక్కలు ఎండబెడితే రెండు మూడు గంటల్లో మాడిపోతున్నాయి. ఇక వడియాలు పెడితే రెండో రోజు ఎండబెట్టే పనేలేదు. భానుడి భగభగలకు నేల నిప్పుకణికలా మారింది. నిన్న 47.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకాగా, నేడు అది 50 డిగ్రీలను తాకే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 9 గంటల తరువాత ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని వివరించారు. నల్గొండ, నిజామాబాద్, కృష్ణా, ప్రకాశం, కరీంనగర్ జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News