: 'జమైకా చిరుత' ఉసెన్ బోల్ట్ ను దాటేసిన కోహ్లీ!
అవును, మీరు చదివింది నిజమే. 'జమైకా చిరుత' ఉసేన్ బోల్ట్ ను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. అయితే, పరుగుల పోటీలో కాదులెండి. వాణిజ్య పరంగా అత్యధికంగా పాప్యులారీటీ ఉన్న క్రీడాకారుల జాబితాలో. 'స్పోర్ట్స్ ప్రో' అనే బ్రిటన్ పత్రిక ఈ జాబితాను ప్రకటించగా, విరాట్ కోహ్లీకి 6వ స్థానం లభించింది. ఈ జాబితాలో కెనడా టెన్నిస్ తార బౌచర్డ్ మొదటి స్థానంలో నిలువగా, బ్రెజిల్ ఫుట్బాల్ స్టార్ నెయిమార్, అమెరికా గోల్ఫ్ క్రీడాకారుడు జోర్డాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కోహ్లీకి ఆరవ స్థానం లభించగా, బోల్ట్ 10, జకోవిచ్ 14, మెస్సీ 16, రొనాల్డ్ 22 స్థానాల్లో నిలిచారని 'స్టార్ ప్రో' వెల్లడించింది.