: కాబోయే భార్యకు 23 లక్షల విలువైన హారం ఇచ్చిన బాలీవుడ్ స్టార్


బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తన కాబోయే భార్యను విలువైన బహుమతితో సర్ప్రైజ్ చేశాడు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోనున్న షాహిద్, కాబోయే భార్యకు 23 లక్షల రూపాయల విలువ చేసే వజ్రాల హారం బహుమతిగా అందజేశాడు. ఈ వార్త షాహిద్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. షాహిద్ కపూర్ కు మీరా రాజ్ పుత్ అనే యువతితో వచ్చే నెల 10న వివాహం నిశ్చయించిన సంగతి తెలిసిందే. కాగా, షాహిద్ కపూర్ కు బాలీవుడ్ లో 'కరీనాకపూర్ మాజీ ప్రియుడి'గా గుర్తింపు ఉంది. కరీనాతో బ్రేకప్ అనంతరం పలు ప్రేమాయణాలు నడిపిన షాహిద్ కపూర్, వివాహం మాత్రం పెద్దలు కుదిర్చినదే చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News