: తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డికి పితృ వియోగం
తెలంగాణ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మల్లారెడ్డి నేడు కన్నుమూశారు. హైదరాబాదు బంజారాహిల్స్ లోని సొంత ఇంట్లో ఆయన చివరి శ్వాస విడిచారు. కాగా, మహేందర్ రెడ్డి కుటుంబానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.