: విలాసాల కోసమే ఏటీఎంలో దోపిడీ చేశాడట


హైదరాబాదులోని యూసఫ్ గూడ ఏటీఎంలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను దోపిడీ చేసిన దుండగుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఏటీఎంలో యువతిని బెదిరించి నగదు, నగలు తీసుకుని పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక్క రోజులోనే నిందితుడిని అదుపులోకి తీసుకోవడం విశేషం. నిందితుడు కడప జిల్లాకు చెందిన పి.శివకుమార్ రెడ్డిగా గుర్తించారు. మూడేళ్ల క్రిందట ఉపాధి నిమిత్తం హైదరాబాదు వచ్చిన శివకుమార్ విలాసాలకు అలవాటు పడ్డాడు. దీంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు దోపిడీలకు పాల్పడ్డాడు. ఇందుకోసం మహారాష్ట్రలో తుపాకీ కొనుగోలు చేశాడు. శివకుమార్ రెడ్డి నుంచి పోలీసులు తుపాకీ, 6 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News