: ఇది లాడెన్ కొడుకు 'లవ్ లెటర్'!
కరుడుగట్టిన ఉగ్రవాదైనప్పటికీ అతనికి కూడా ఓ మనసు ఉంటుంది. భావాలు, భావోద్వేగాలు, ప్రేమ, ఆప్యాయతలు తమకూ ఉంటాయని లాడెన్ కుమారుడు నిరూపించాడు. లాడెన్ మరణించిన ఇన్నాళ్లకు అతనికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలకు సంబంధించిన దస్త్రాల నకళ్లను అమెరికా విడుదల చేసింది. అందులో లాడెన్ ప్రధాన అనుచరుడు, అతని కన్న కొడుకు సాద్ లాడెన్ తన భార్యకు వీడియో ద్వారా పంపిన ప్రేమ లేఖలు బయటపడ్డాయి. వీడియో మెసేజ్ గా ఉన్న ఆ లేఖను ఆంగ్లంలోకి తర్జుమా చేసి విడుదల చేశారు. అందులో తన భార్యను ప్రాణానికి ప్రాణంగా పేర్కొన్నాడు. మరణానంతరం స్వర్గంలో కూడా ఆమే తన భార్యగా ఉండాలని పేర్కొన్నాడు. 'తాను మరణిస్తే, రాలేకపోతే మళ్లీ పెళ్లి చేసుకో' అని కూడా భార్యకు సూచించాడు. కాగా, లాడెన్ కంటే ముందే డ్రోన్ దాడిలో సాద్ లాడెన్ మరణించిన సంగతి తెలిసిందే.