: అంత సీన్ లేదు, సార్: సినీ నటుడు శివాజీ


తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నానని, కానీ, కొందరు కేంద్ర మంత్రులు... 'ఎవడీ శివాజీ... వీడ్నొక చూపు చూద్దాం' అంటూ తేలిగ్గా మాట్లాడుతున్నారని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. వారికి డబ్బు మదం ఉంటే, తనకు ఆత్మ విశ్వాసం ఉందని తెలిపారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని, పోతూ పోతూ మీలో ఒకరి తీసుకెళతానని హెచ్చరించారు. అందుకు సిద్ధమైతే తనతో పెట్టుకోవాలని సవాల్ విసిరారు. 'సామాన్యులు చేస్తున్న ఉద్యమం ఇది' అని పేర్కొన్నారు. మంత్రులందరికీ నెలరోజుల టైం ఇస్తున్నానని అన్నారు. వైఖరి ప్రకటించకపోతే ఇళ్లముందు నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, విపక్ష నేత జగన్ ను కూడా కొందరు బెదిరిస్తున్నారని వాపోయారు. జగన్ కు చిత్తుశుద్ధి ఉంటే ఆయనకు తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. నేతలు ఎందుకు పోరాడరని నిలదీశారు.

  • Loading...

More Telugu News