: హిట్లర్ గుర్రాల విగ్రహాలు బయటపడ్డాయి
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గుర్రాల విగ్రహాలు బయటపడ్డాయి. బెర్లిన్ గోడ కూలిన అనంతరం ఈ గుర్రాల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. గోడ కూలడానికి ముందు సోవియట్ సైనిక శిబిరాల వద్ద ఈ గుర్రాల విగ్రహాలు ఉండేవట. ఇంత కాలం తరువాత ఆ విగ్రహాలను జర్మన్ పోలీసులు కనుగొన్నారు. అడాల్ఫ్ హిట్లర్ గ్రాండ్ ఛాన్సలరీ భవనం ముందు మిలియన్ల యూరోల విలువ చేసే గుర్రాల విగ్రహాలు, విలువైన కళాఖండాలకు చెందిన విడి భాగాలు, నాజీల కాలం నాటి పలు కళాకృతులు కనుగొన్నామని జర్మన్ పోలీసులు వెల్లడించారు. వాటితోపాటు ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు వారు తెలిపారు.