: లాడెన్ కు డబ్బులు పంపిన ఆ 'ఇండియన్ బ్రదర్' ఎవరు?
అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో కాల్చి చంపాక యూఎస్ నేవీ సీల్స్ పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో లభ్యమైన ఓ 'స్ప్రెడ్ షీట్' ఆసక్తికర వివరాలను బయటపెట్టింది. మదీనాలోని ఓ భారతీయుడు లాడెన్ కు ఆర్థిక సాయం అందజేసిన వివరాలు అందులో ఉన్నాయి. లాడెన్ అతడిని 'ఇండియన్ బ్రదర్ ఇన్ మదీనా'గా పేర్కొనడంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తింది. 2009 మే, జులై మాసాల మధ్య ఆ 'ఇండియన్ బ్రదర్' లక్షల రూపాయలు లాడెన్ కు పంపినట్టు వెల్లడైంది. ఇక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్ కు చెందిన మద్దతుదారుల నుంచే భారీ మొత్తాల్లో సొమ్ము అల్ ఖైదాకు అందినట్టు యూఎస్ మెరైన్లు స్వాధీనం చేసుకున్న పత్రాలు చెబుతున్నాయి.