: సొంత సిలబస్ లు వద్దు: ప్రైవేటు స్కూళ్లకు టీ సర్కారు హుకుం


టెక్నో సిలబస్, ఇంటర్నేషనల్ సిలబస్ అంటూ ప్రైవేటు స్కూళ్లు చేసే హడావుడి అంతాఇంతా కాదు. ఈ హంగామాకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఇకపై, తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు స్టేట్ సిలబస్ ను అనుసరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ముద్రిత పాఠ్య పుస్తకాలనే ఉపయోగించాలని పేర్కొంది. చాలా పాఠశాలలు డైనమిక్, ఇంటిగ్రేటెడ్ కర్రిక్యులమ్ తో విద్యాబోధన చేపడుతున్నాయి. టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు మినహా, ఇతర పరీక్షలన్నీ సొంత పంథాలో నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్ సీ బోర్డు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ పరీక్షలకు ప్రశ్నాపత్రాలు పంపుతున్నా, వాటిని పక్కనబెట్టి, ప్రైవేటు స్కూళ్లు సొంత క్వశ్చన్ పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. స్టేట్ సిలబస్ ప్రమాణాల పరంగా ఏమంత మెరుగైనది కాదన్నది అత్యధిక ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల నిశ్చిత అభిప్రాయం. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని తెలంగాణ సర్కారు కృతనిశ్చయంతో ఉంది.

  • Loading...

More Telugu News