: మళ్లీ టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్న సైనా
ఇండియన్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. గత నెల ప్రారంభంలో తొలి స్థానానికి ఎదిగిన ఈ హైదరాబాదీ... ఆ తర్వాత టాప్ ర్యాంకును కోల్పోయింది. ఈ రోజు బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సైనా అగ్రస్థానంలో ఉంది. మరో తెలుగుతేజం పివీ సింధు ఒక ర్యాంకు కోల్పోయి 12వ స్థానానికి చేరుకుంది. పురుషుల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే... శ్రీకాంత్ 4వ స్థానంలో, పారుపల్లి కశ్యప్ 13వ స్థానంలో కొనసాగుతున్నారు.