: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ... ఆరు స్థానాలకు ఏడు నామినేషన్లు దాఖలు


ఎమ్మెల్యే కోటాలో జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు జరగబోతున్న ఎన్నికలకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో టీఆర్ఎస్ నుంచి ఐదుగురు అభ్యర్థులు, కాంగ్రెస్, టీడీపీ నుంచి చెరొక అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను రేపు పరిశీలిస్తుండగా, 25న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 1న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News