: మోదీ మంత్రివర్గాన్ని విమర్శించి... రాహుల్ ను పొగిడిన బాబా రాందేవ్


ప్రఖ్యాత యోగా గురు బాబా రాందేవ్ ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ ఏడాది పాలనపై స్పందించారు. మోదీ కేబినెట్ లోని మంత్రులు అహంభావులని విమర్శించారు. వారు ఎన్నికల ముందు ఒకలా, తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, జైట్లీ, అమిత్ షా మినహా మిగతావారు ఫోన్ నెంబర్లు మార్చేశారని, ఇది సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. వారు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరహా వైఖరి పట్ల వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. తర్వాత ఎన్నికలంటూ ఉంటాయన్న విషయం గుర్తెరగాలని అన్నారు. ఈ సందర్భంగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశంసించారు. చచ్చిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ జీవం పోశాడని కితాబిచ్చారు. జడత్వం ఆవరించిన పార్టీని మళ్లీ గాడిలో పెట్టాడని కొనియాడారు. రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుల విశ్వాసాన్ని తిరిగి సంపాదించాల్సి ఉందని రాందేవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News