: దొంగను పట్టించిన గేదె!


నగలు లాక్కొని పారిపోతున్న ఓ దొంగ గేదె బారినపడి దొరికిపోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మన్నెంవారి పల్లెలో జరిగింది. గత అర్ధరాత్రి గ్రామానికి చెందిన విజయమ్మ తన కుమారుడు, కుమార్తెలతో కలసి నిద్రిస్తోంది. ఒంటిగంట దాటిన తరువాత వచ్చిన నలుగురు గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని బంగారం గొలుసును, చెవి కమ్మలను లాక్కున్నారు. దీంతో బాధితులు పెద్దగా కేకలు వేయడంతో కంగారుపడి పరుగు లంఘించుకున్నారు. వీరిలో ఒకడిని ఇంటి ఆవరణలోని గేదె తన కొమ్ములతో పొడిచింది. గాయాలపాలైన ఆ దొంగను అప్రమత్తమైన చుట్టుపక్కల వాళ్లు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మిగతా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News