: చెత్త ఎత్తివేయాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఎప్పుడైనా వచ్చిందా?: నాయిని
ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమాన్ని ప్రజలంతా మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం అభాండాలు వేస్తున్నారని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. అసలు కాంగ్రెస్ నేతలకు ఏనాడైనా చెత్త ఎత్తివేయాలనే ఆలోచన వచ్చిందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో మీడియా సమావేశంలో నాయిని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందన్నారు. తమ పార్టీపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, దీనిని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ ను హెచ్చరించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తీవ్ర కృషి చేస్తున్నారన్నారు.