: ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నాం... 28 నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై ట్యాక్స్: టీఎస్ మంత్రి మహేందర్ రెడ్డి
తెలంగాణలో ప్రయాణికుల నడ్డి విరగనుంది. చార్జీల మోత మోగించేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు, త్వరలోనే ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నామని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే చార్జీలను పెంచాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాకుండా ఈ నెల 28 నుంచి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తాయని తెలిపారు. 28 నుంచి పర్మిట్ పూర్తై తెలంగాణకు వచ్చే ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై ట్యాక్స్ వసూలు చేస్తామని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్ర ఆర్టీసీకే చెందుతాయని చెప్పారు.