: సామ్రాట్ అశోక చక్రవర్తికి కులం రంగు!


సామ్రాట్ అశోక చక్రవర్తిది ఏ కులం? ఇదేం ప్రశ్న ఆయన గురించి చదువుకున్న ఏ పాఠంలో కూడా సమాచారం లేదే అని ఆలోచిస్తున్నారా? కానీ, బీజేపీ మిత్ర పార్టీ, లోక్ సభలో మూడు సీట్లను కలిగి, పేరులోనే కులాన్ని నింపుకున్న 'రాష్ట్రవాది కుష్వాహ పరిషద్' మాత్రం అశోకుడు తమ కులపువాడని చెబుతోంది. త్వరలో రానున్న బీహార్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆశోకుడి కులాన్ని తెరపైకి తెచ్చారు. ఇదిలావుండగా, అశోకుని 2320వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పనిలోపనిగా, ఆయన పేరిట ఓ స్టాంపును, ఓ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. బీహారులోని మొత్తం ఓటర్లలో 9 శాతం ఉన్న కుష్వాహులు ఓబీసీ ఓటర్లలో అత్యధికులు. కాగా, ఏ చారిత్రక పుస్తకంలోనూ ఆశోక్ కుల ప్రసక్తి లేదని చరిత్రకారులు చెబుతున్నారు. బీజేపీ నేతలు తన స్వలాభాల కోసం చరిత్రను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News