: వడదెబ్బకు సొమ్మసిల్లిన రఘువీరారెడ్డి
ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వడదెబ్బకు గురయ్యారు. కర్నూలు డీసీసీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందట ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అక్కడివారు వైద్యుల చేత ప్రాథమిక చికిత్స చేయించడంతో రఘువీరా కోలుకున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారే పెరగడంతో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే భానుడి ప్రతాపంతో తెలుగురాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. పలు ప్రాంతాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు బయట తిరగకుండా ఉండాలని, ప్రయాణాలు మానుకోవాలని, పసిపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు.