: ఎండదెబ్బకు కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి
భానుడి ప్రతాపం తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుపై పడింది. 'స్వచ్ఛ హైదరాబాదు'లో భాగంగా వివిధ ప్రాంతాలను పరిశీలించేందుకు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఆయన పర్యటించారు. ఒకవైపు ఎండలు మండిపోతూ ఉండడం, గాలిలో తేమశాతం తగ్గిపోయి ఉక్కపోతతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎండ వేడిమితో పాటు చెమటలు పడుతుండటంతో, పలుమార్లు ముఖం తుడుకుచుకుంటూ కనిపించారు. గొంతు ఎండిపోతుంటే అడిగి తెప్పించుకుని మంచినీరు తాగారు. ఆయన హావభావాలను పలు టీవీ చానళ్లు, ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు.