: పసిఫిక్ మహాసముద్రంలోని సాల్మన్ దీవుల్లో భూకంపం


పసిఫిక్ మహాసముద్రంలోని సాల్మన్ దీవుల్లో ఈ రోజు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. భూమి లోపల 19 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని వెల్లడించింది. అయితే దానివల్ల సునామీ ప్రమాదం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వివరించింది. గత మూడేళ్ల కాల వ్యవధిలో దాదాపు 30 స్వల్ప భూకంపాలు సంభవించాయని జియోలాజికల్ సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News