: ఆకుల లలితకు చాన్సిచ్చిన తెలంగాణ కాంగ్రెస్... భగ్గుమన్న దానం


తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, పలువురు సీనియర్లను పక్కనబెట్టి ఆకుల లలితకు అవకాశం ఇవ్వడంతో విభేదాలు భగ్గుమన్నాయి. గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఏకంగా రాజీనామా చేస్తానని దిగ్విజయ్ సింగ్ కు లేఖ రాశారు. తక్షణం ఆమె పేరును నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమెకు సీటివ్వడం వల్ల గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వీసమెత్తు ఉపయోగం కూడా ఉండదని ఆయన విమర్శించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉండడంతో పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, దానం నాగేందర్, డీ శ్రీనివాస్ తదితర సీనియర్లెందరో సీటు తమకు కావాలని అధిష్ఠానం వద్ద లాబీయింగ్ నడిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News