: నువ్వు చనిపోతే ఎవరికి చెప్పాలి?: అల్ ఖైదా జాబ్ అప్లికేషనులో కొత్త కాలమ్స్
ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే పేరు, తండ్రిపేరు, విద్యార్హతలు, అనుభవం, చిరునామా వంటి వివరాలు తెలియజేయాల్సి వుంటుందని అందరికీ తెలిసిందే. కానీ, అల్ ఖైదాలో చేరాలని భావించి దరఖాస్తు నింపాలనుకుంటే మాత్రం పలు కొత్త ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వుంటుంది. ఏదైనా ఆత్మాహుతి దాడికి పాల్పడగలవా? నువ్వు చనిపోతే ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేయాలి? వంటి కాలమ్స్ నింపాల్సి వుంటుంది. "దయచేసి సమాచారాన్ని కరెక్టుగా, నిజాయతీగా, స్పష్టంగా ఇవ్వండి" అన్న సూచన కూడా ఉందట. ఇటీవలి కాలంలో కొత్త జీహాదీల కోసం అల్ ఖైదా నియామకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.