: ఆ ప్రశ్నలు అడగద్దంటున్న షారుఖ్ ఖాన్!
'ఆస్క్ షారూక్' అంటూ తాను ప్రారంభించిన లైవ్ ట్విట్టర్ చాట్ లో బాలీవుడ్ బాద్షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయాల గురించి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించకూడదని మీరు భావిస్తున్నారు? అని ఓ అభిమాని ప్రశ్నించగా, దానికి షారూక్ పెద్ద జాబితానే సమాధానంగా ఇచ్చారు. ఫేవరెట్ కలరేంటి? ఫేవరెట్ వంటకం ఏంటి? సల్మాన్ ఖాన్ తో ఉన్న సంబంధమేంటి? కలెక్షన్ల పోలికలు, ఫేవరెట్ హీరోయిన్, తన చిత్రం విడుదల తేదీ, విచారంగా కనిపిస్తున్నారెందుకు?... వంటి ప్రశ్నలను తనను అడగొద్దని షారూక్ బదులిచ్చాడు. కాగా, ఇటీవల సల్మాన్ కు జైలుశిక్ష పడ్డప్పుడు అతని ఇంటికి వెళ్లి షారూక్ పరామర్శించిన సంగతి తెలిసిందే.