: ముంబైపై ఉగ్రదాడి 'హీరోయిక్'...పుణెలో జర్మనీ బేకరీ పేలుడు 'బ్యూటిఫుల్'!


పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో అమెరికన్ సైన్యం అల్ ఖైదా ఉగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ను చుట్టుముట్టి హతమార్చిన తరువాత అక్కడి నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్ల వివరాలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. మొత్తం 100 పేజీలకు పైగా ఉన్న ఈ డాక్యుమెంట్లలో ఇండియాపై జరిగిన ఉగ్రవాద దాడుల గురించి లాడెన్ తన అభిప్రాయాలను పంచుకున్నట్టు యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు వివరించారు. నవంబర్ 26న ముంబైపై జరిగిన దాడిని 'హీరోయిక్ ఫిదాయీ ఆపరేషన్'గా, పుణెలోని జర్మనీ బేకరీ వద్ద పేలుడును 'బ్యూటిఫుల్ హ్యూజ్ బాంబింగ్'గా ఆయన అభివర్ణించుకున్నారు. వీటితో పాటు అల్ ఖైదా వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల పైనా ఆయన అభిప్రాయాలు ఇందులో ఉన్నాయట. లండన్ బాంబింగ్ కు ముందు, ఆ తరువాత అమెరికా, యూరప్, ఇండొనేషియా, పాకిస్థాన్, ఈజిప్ట్, ఇండియా తదితర ప్రాంతాల్లో ఎన్నో ఆపరేషన్స్ విజయవంతమైనాయని ఆయన వ్యాఖ్యానించినట్టు డాక్యుమెంట్లలో ఉంది. కాగా, ముంబై దాడిలో 150 మంది, జర్మన్ బేకరీ పేలుడులో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News