: దోపిడీకి గురైన హౌరా ఎక్స్ ప్రెస్... పోలీసుల కాల్పులు


హౌరా ఎక్స్ ప్రెస్ లో ఈ తెల్లవారుఝామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చైను లాగి రైలును నిలిపివేసి భారీ చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల హాహాకారాలతో తేరుకున్న రైల్వే పోలీసులు వారిపై కాల్పులు ప్రారంభించగా, రైలు దూకి చీకట్లో పరారయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైలును ఆపిన దుండగులు, ప్రయాణికులను బెదిరించి వారి వద్దనున్న నగదు, ఆభరణాల కోసం తెగబడ్డారు. కొంతమందిని దోచుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో, కిందకు దూకిన దొంగలు... పోలీసులు, ప్రయాణికులపై రాళ్లు రువ్వుతూ పరుగులు తీశారు. ఈ దుండగులు చెన్నై ఎక్స్ ప్రెస్, తిరుమల ఎక్స్ ప్రెస్ లలో కూడా అదే తరహాలో దోపిడీకి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News