: ఫేస్‌ బుక్‌ తో ఫ్రెండ్స్ అయి, కంపెనీ పెట్టి దూసుకెళ్తున్న ముగ్గురు యువకులు


వారిది ఒకే ప్రాంతం కాదు. అయినా ఆలోచనలు కలిశాయి. ఫేస్ బుక్ మాధ్యమంగా ఒకరితో ఒకరికి పరిచయం అయింది. భావజాలాలు ఒకేలా వుండడంతో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల క్రితం జోవియాన్ అనే కంపెనీని ఢిల్లీ కేంద్రంగా ప్రారంభించారు. వారే ఉత్తరప్రదేశ్‌ లోని షహరాన్‌ పూర్‌ కి చెందిన రాఘవ్, హరియాణా రాష్ట్రానికి చెందిన అంకిత్ భటేజా, సౌరభ్ కౌశల్ లు. మరో రెండేళ్లలో క్యూబ్ పేరిట శాటిలైట్ ను ప్రయోగించేందుకు యత్నాలు చేస్తున్న వీరి లక్ష్యాలు కూడా పెద్దవేనండోయ్. చిన్న చిన్న శాటిలైట్ల తయారీ, త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత, అంతరిక్షంలోని చెత్తను తొలగించడం, సైన్యం కోసం సహాయపడే రోబోల తయారీ, ప్రత్యామ్నాయ రాకెట్ సాంకేతికత తదితర పెద్ద పెద్ద టార్గెట్లతో వీరు పరిశోధనలు చేస్తూ, అదే లక్ష్యంతో కృషి చేస్తున్న వారికి తమవంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆల్ ది బెస్ట్!

  • Loading...

More Telugu News