: తెలంగాణలో భారీగా పోలీసు ఉద్యోగాలు... పరీక్షల విషయంలో సడలింపులు!
తెలంగాణ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు పడ్డాయి. 2008లో పోలీసు శాఖకు మంజూరు చేసిన 35 వేల ఉద్యోగాల్లో సుమారు 7 వేల నియామకాలు ఇంకా జరగలేదు. వీటిల్లో డ్రైవర్, కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. కాగా, పోలీసుల దేహదారుఢ్య పరీక్షల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కుంటున్న '5 కి.మీ పరుగు' నియమాన్ని సడలించే ఆలోచనలో కేసీఆర్ సర్కారు ఆలోచనలు చేస్తోంది. మరో రెండు నెలల కాలంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్నారు. పోలీసు శాఖలో తొలుత దేహదారుఢ్య, ఆపై రాత పరీక్షలు జరుగుతుండగా, ఆ విధానం మార్చి తొలుత రాత పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల అభ్యర్థులపై ఒత్తిడి తగ్గుతుందని, ఇదే సమయంలో 5 కి.మీ పరుగు పందెం బదులు 3 కి.మీ పరుగు పందెం పెట్టాలని కూడా యోచిస్తున్నట్టు తెలిసింది.