: గేల్ ఉతుకుడుకి బంతి మారింది!


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా పూనేలో ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూరు రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకోగా, విరాట్ కోహ్లీ (8), క్రిస్ గేల్ ధాటిగా బ్యాటింగ్ ఆరంభించారు. రాజస్థాన్ బౌలర్లు ఆకట్టుకునేలా బంతులేస్తున్నప్పటికీ బెంగళూరు బ్యాట్స్ మన్ ఆటాడుకుంటున్నారు. క్రిస్ గేల్ ఉతికిన ఉతుకుడుకి గాయపడిన బంతిని ఐదో ఓవర్లో మార్చాల్సి వచ్చింది. దీంతో ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి బెంగళూరు జట్టు 38 పరుగులు చేసింది. కొత్త బంతిని అందుకున్న ధావల్ కులకర్ణి అద్భుతమైన బంతికి గేల్ (27) ను పెవిలియన్ బాటపట్టించాడు. 6 ఓవర్లలో తొలి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News