: కోల్ కతా, ముంబై, బెంగళూరే అభివృద్ధి చెందుతున్నాయట!


ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో కోల్ కతా, ముంబై, బెంగళూరు నగరాలు చోటు సంపాదించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న నగరాలపై సింగపూర్ కు చెందిన ఏటీ కెర్నీస్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారత్ లో అతిపెద్ద నగరాలైన ఈ మూడు నగరాలు వ్యాపార, సమాచార మార్పిడి, సాంస్కృతిక, మానవాభివృద్ధి రంగాల్లో దూసుకుపోతున్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇండెక్స్ లో న్యూయార్క్, లండన్ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News