: 'ఫేస్ బుక్' ప్రేమికుడి కోసం భారత్ వచ్చి తనువు చాలించింది!


ఆమె పేరు ఏంజెలా స్లిన్. వయసు 45. ముగ్గురు బిడ్డల తల్లి. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. బ్రిటన్ లో నర్సుగా పనిచేసిన ఈ మహిళకు ఫేస్ బుక్ లో భారత్ కు చెందిన జస్పాల్ సింగ్ (30) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. జస్పాల్ లూథియానా వాసి. కాగా, వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే, ఓ రోజు ఎవరికి చెప్పకుండా స్లిన్ భారత్ పయనమైంది. జస్పాల్ ను కలుసుకోవాలన్నది ఆమె కోరిక. అయితే, భారత్ చేరుకున్న తర్వాత ఆమె న్యుమోనియా బారినపడింది. పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. తన ప్రేమికుడిని కలవాలన్న కోరిక తీరకుండానే విషాదకర పరిస్థితుల నడుమ తనువు చాలించింది. స్లిన్ చనిపోయిందన్న విషయం తెలిసి జస్పాల్ షాక్ తిన్నాడు. ఆమె ఇక లేదన్న విషయం నమ్మలేకుండా ఉన్నానని ఎంతో బాధగా చెప్పాడు.

  • Loading...

More Telugu News