: సుబ్రహ్మణ్య స్వామీ... ఇదేంది స్వామీ?


జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడాల్సిందేనంటూ గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఓ పెళ్లిలో విచిత్రంగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని తిరునల్వేలిలో ఓ వివాహానికి ఆయన హాజరయ్యారు. పెద్దమనిషి కదా అని, తాళిబొట్టు ఆయన చేతుల మీదుగా వరుడికి ఇప్పిద్దామని పెళ్లి పెద్దలు భావించారు. తాళి అందుకున్న ఆయన నేరుగా వెళ్లి పెళ్లికూతురు మెడలో కట్టేందుకు ప్రయత్నించారు. ఇంతలో, ఓ మహిళ అడ్డుకోవడంతో ఆయన ఈ లోకంలోకి వచ్చిపడ్డారు. వెంటనే నవ్వుతూ తాళిని వరుడికి అందించారు. ఇది చూసి వధూవరుల కుటుంబ సభ్యులైతే దిగ్భ్రాంతికి లోనయ్యారు. అక్కడున్న వారందరూ, 'ఇదేంటి పెద్దాయన ఇలా ప్రవర్తించారు?' అనుకున్నారట. ఆనక, తన చర్యకు సుబ్రహ్మణ్య స్వామి కూడా కాస్త సిగ్గుపడ్డారట.

  • Loading...

More Telugu News