: ఏపీకీ ప్రత్యేక హోదాపై నా అభిప్రాయం వ్యక్తిగతం: ఎంపీ గుత్తా
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని ప్రధానమంత్రికి లేఖ రాశానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తనను విమర్శించే హక్కు ఏపీ కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని రఘువీరా అప్పుడెందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయితీలు ఇస్తే తెలంగాణకు పరిశ్రమలు రావన్నారు. విభజన సమయంలో ఏపీ కాంగ్రెస్ నేతల తీరు వల్లే ఇరు ప్రాంతాలకు నష్టం జరిగిందని ఆయన మండిపడ్డారు.