: ఆధార్ అనుసంధానంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానం: భన్వర్ లాల్


ఆధార్ కార్డు అనుసంధానంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఎన్నికల అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. ఇప్పటివరకు ఏపీలో 84 శాతం, తెలంగాణలో 76 శాతం ఆధార్ అనుసంధానం పూర్తయిందని తెలిపారు. జీహెచ్ ఎంసీలో 30 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం జరిగిందని మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. ఇక జూన్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో 12, ఏపీలో 13 స్థానాలు ఖాళీలున్నాయని, జూన్ 6లోగా ఓటర్ లిస్ట్ ల తయారీ చేస్తామని భన్వర్ లాల్ ప్రకటించారు. మే 31లోగా ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం పూర్తవుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News