: వారి తకరారు తీర్చడం మా వల్ల కావడం లేదు...మీరే తీర్చండి: రాజ్ నాధ్ సింగ్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్యతలెత్తిన వివాదంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. గవర్నర్ రాజ్యంగ పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారంటూ కేజ్రీవాల్, సీఎం విధానాలు బాగలేవని, ఆయన సంప్రదాయం పాటించడం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ నిన్న రాష్ట్రపతిని కలిసిన సంగతి తెలిసిందే. కాగా, వీరిద్దరూ సీఎస్ నియామకం విషయంలో విభేదించారు. ఈ నేపథ్యంలో వారి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్రపతితో రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు.