: అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణానికి భూమి ఇచ్చిన ముస్లింలు... మతసామరస్యమంటే ఇదే!


ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణానికి బీహార్ ముస్లింలు భూమిని డొనేట్ చేసి భారత మతసామరస్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటారు. సుమారు 20 వేల మంది ఒకేసారి వెళ్లగలిగేంత పెద్దదిగా నిర్మితమవుతున్న దేవాలయానికి చాలా నామమాత్రపు ధరకు ముస్లింలు భూమిని ఇచ్చారని, వారి మద్దతు లేకుంటే ఈ కలల ప్రాజెక్టు కష్టతరమయ్యేదని మహావీర్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ వ్యాఖ్యానించారు. ఈ దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ముస్లింలు సైతం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. మొత్తం రూ. 500 కోట్ల వ్యయంతో ఈస్ట్ చంపారన్ జిల్లాలోని జానకీ నగర్ సమీపంలో జూన్ లో నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ దేవాలయం 2,500 అడుగుల పొడవు, 1,296 అడుగుల వెడల్పు, 379 అడుగుల ఎత్తుతో భూకంపాలను తట్టుకునేలా నిర్మితమవుతోంది.

  • Loading...

More Telugu News