: ఉస్మానియాలో ఆగని నిరసనలు... కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా మూడవరోజు కూడా ఓయూ క్యాంపస్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. నిన్న (మంగళవారం) కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టిన విద్యార్థులు ఈ రోజు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద ఆ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు నిన్న, నేడు ఓయూ బంద్ కు పిలుపునిచ్చారు.