: ధోనీపై ఐపీఎల్ క్రమశిక్షణా సంఘం చర్యలు... మ్యాచ్ ఫీజులో కోత


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఐపీఎల్ క్రమ శిక్షణా సంఘం చర్యలు తీసుకుంది. ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో స్మిత్ ను ఎల్ బీడబ్ల్యూగా ప్రకటించిన అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబడుతూ ధోనీ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దాంతో చర్యలు చేపట్టిన క్రమశిక్షణా సంఘం అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం కెప్టెన్ ధోనీ లెవల్ వన్ తప్పిదానికి పాల్పడినట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News