: మనోజ్ పెళ్లికి పవన్ కల్యాణ్


హీరో మంచు మనోజ్, ప్రణతిరెడ్డిల వివాహానికి నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. వివాహ ప్రాంగణంలోకి పవన్ రాగానే మోహన్ బాబు ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. అక్కడినుంచి పవన్ ను పెళ్లి మంటపంలోకి స్వయంగా తీసుకుని వెళ్లగా, పవన్ వధూవరులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత మోహన్ బాబు కుటుంబ సభ్యులతో ఫోటో దిగారు. ఈ సమయంలో పవన్ కు తన వియ్యంకుడిని మోహన్ బాబు పరిచయం చేశారు. అనంతరం పవన్ వెళుతున్న సమయంలో చేయిపట్టుకుని మరీ మోహన్ బాబు తీసుకువెళ్లారు.

  • Loading...

More Telugu News