: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సాయంతో బీజేపీ పోటీ... అభ్యర్థిగా సోము వీర్రాజు!
ఏపీ శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లలో ఒకటి బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. రెండు పార్టీల పొత్తులో భాగంగా అంగీకరించడంతో ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుందని సమాచారం. సుదీర్ఘకాలంగా వీర్రాజు బీజేపీలో పనిచేస్తున్నారు. ఇంతవరకు పార్టీ ప్రచారానికే పరిమితమైన ఆయన తొలిసారి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. మరోవైపు వీర్రాజు అభ్యర్థిత్వాన్ని కొందరు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.